
వరంగల్ , హన్మకొండలను జిల్లాలుగా మారుస్తూ ఫైనల్ జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 13 మండలాలతో వరంగల్ జిల్లా, 14 మండలాలతో హన్మకొండ మండలాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బుధవారం సాయంత్రం వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌లు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష పూర్తయిన మరుసటి రోజే హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.