తల్లి రెండో పెళ్లి.. బాలికపై సొంత తాత, మేనమామే కన్నేసి...

By telugu team  |  First Published Feb 4, 2020, 10:57 AM IST

ఆ ఇంట్లో సదరు మహిళ తండ్రితో పాటు ఆమె సోదరుడు అలియాస్ నవాజ్(25) కూడా ఉంటున్నాడు. కాగా... ఆ ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి బాలికకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. రెండేళ్లపాటు బాలికను బెదిరించి మేనమామ అఘాయిత్యానికి పాల్పడగా... గత ఆరునెలలుగా బాలిక తాత కూడా ఆమె ఘాతుకానికి పాల్పడ్డాడు.

రక్షణగా నిలవాల్సిన తాత, మేనమామే ఆ బాలికపై కన్నేశారు. రెండేళ్లపాటు మేనమామ, ఆరు నెలలుగా సొంత తాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం విషాదకరం. వారి అరచకాలు తట్టుకోలేక బాలిక ఆమె కన్న తల్లికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read కాఫీలో మత్తు మందు కలిపి రేప్ చేశాడు, 12 ఏళ్లుగా...: రఘునందన్ రావుపై మహిళ ఆరోపణ...

Latest Videos

పూర్తి వివరాల్లోకి వెళితే...  బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కు పెళ్లై కుమార్తె ఉంది. ఐదు సంవత్సరాల క్రితం సదరు మహిళ భర్త మృతిచెందాడు. దీంతో ఆమెకు బంధువులు మరో వివాహం జరిపించారు. భర్తతో కలిసి బండ్లగూడలో కాపురం పెట్టింది. కుమార్తెను తన తండ్రి ఫేక్ ఆఫ్సర్(70)వద్ద వదిలిపెట్టింది.

ఆ ఇంట్లో సదరు మహిళ తండ్రితో పాటు ఆమె సోదరుడు అలియాస్ నవాజ్(25) కూడా ఉంటున్నాడు. కాగా... ఆ ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి బాలికకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. రెండేళ్లపాటు బాలికను బెదిరించి మేనమామ అఘాయిత్యానికి పాల్పడగా... గత ఆరునెలలుగా బాలిక తాత కూడా ఆమె ఘాతుకానికి పాల్పడ్డాడు.

తట్టుకోలేక పోయిన బాలిక విషయాన్ని ఆలస్యంగా తల్లికి తెలియజేయగా... ఆమె పోలీసులను ఆశ్రయించింది. తల్లీ, కూతుళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!