శిశువులను అమ్మే ముఠా... ఒక్కో చిన్నారిని ఎంతకు బేరమాడుతున్నారంటే..

Published : Feb 04, 2020, 10:18 AM IST
శిశువులను అమ్మే ముఠా... ఒక్కో చిన్నారిని ఎంతకు బేరమాడుతున్నారంటే..

సారాంశం

ఈ ముఘాకు పలు సంతాన్య సాఫల్య కేంద్రాలు సహరిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు లేనివారే లక్ష్యంగా ఈ దందాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలను అమ్మే తల్లులకు మాత్రం రూ.70వేలు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం.


హైదరాబాద్ నగరంలో మరో కొత్త ముఠా కలకలం రేపుతోంది. అప్పుడే పుట్టిన చిన్నారులను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. వీరు ఒక్కో చిన్నారికి రూ.10లక్షల నుంచి రూ.14లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆ ధర విని పోలీసులు కూడా విస్తుపోయారు. 

Also Read చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి..

ఈ ముఘాకు పలు సంతాన్య సాఫల్య కేంద్రాలు సహరిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు లేనివారే లక్ష్యంగా ఈ దందాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలను అమ్మే తల్లులకు మాత్రం రూ.70వేలు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన 9మందిని పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటి వ రకు 14మంది చిన్నారులను అమ్మేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే శిశువు విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu