రెండు సార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే హరికృష్ణ ఇంటికొచ్చా: గవర్నర్

Published : Aug 29, 2018, 04:42 PM ISTUpdated : Sep 09, 2018, 11:40 AM IST
రెండు సార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే హరికృష్ణ ఇంటికొచ్చా: గవర్నర్

సారాంశం

మాజీ ఎంపీ, టీడీపీ నేత హరికృష్ణ మృతికి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్  బుధవారం నాడు నివాళులర్పించారు. రెండు సార్లు  హరికృష్ణ  ఇంటికి విషాద సమయంలోనే రావాల్సి వచ్చిందని గవర్నర్  నరసింహన్ గుర్తు చేసుకొన్నారు.


హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత హరికృష్ణ మృతికి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్  బుధవారం నాడు నివాళులర్పించారు. రెండు సార్లు  హరికృష్ణ  ఇంటికి విషాద సమయంలోనే రావాల్సి వచ్చిందని గవర్నర్  నరసింహన్ గుర్తు చేసుకొన్నారు.

బుధవారం నాడు మధ్యాహ్నం  హరికృష్ణ బౌతిక కాయం వద్ద  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు.  రెండు సార్లు హరికృష్ణ ఇంటికి వచ్చినట్టు చెప్పారు.

రెండు సమయాల్లో కూడ విషాద సమయంలోనే  ఆ ఇంటికి వచ్చినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. జానకీరామ్ చనిపోయిన సమయంలో తాను తొలిసారి హరికృష్ణ నివాసానికి వచ్చినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. 

ఆ సమయంలోనే తాను మొదటిసారి హరికృష్ణను కలుసుకొన్నట్టు చెప్పారు. మరో వైపు హరికృష్ణ చనిపోవడంతో మరోసారి రావాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు సమయాల్లో కూడ విషాద పరిస్థితుల్లోనే ఇంటికి రావాల్సి రావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్  హరికృష్ణ కటుంబసభ్యులను ఓదార్చారు.  హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆయన కోరుకొంటున్నట్టు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు