అరెస్ట్ చేస్తే బండి సంజయ్ భయపడతారా?: రాజాసింగ్

By narsimha lode  |  First Published Apr 5, 2023, 9:43 AM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్టును గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  తప్పుబట్టారు.  అరెస్ట్  చేస్తే  బండి సంజయ్  భయపడతారా  అని  ఆయన  ప్రశ్నించారు.  


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్  చేయడానికి   తొందర ఎందుకని   గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  ప్రశ్నించారు. 

బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్  పై  గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  బుధవారంనాడు  స్పందించారు.  ఈ విషయమై  ఓ వీడియోను  రాజాసింగ్  మీడియాకు విడుదల చేశారు. బండి సంజయ్ అరెస్ట్ ను  ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.  నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్  ఎలా చేస్తారని  ఆయన  ప్రశ్నించారు. 

Latest Videos

 బండి సంజయ్ ను  జైలుకు  పంపితే  భయపడతారని  ప్రభుత్వం భావిస్తుందా అని  రాజాసింగ్  ప్రశ్నించారు.  అరెస్టులు చేస్తే  బండి సంజయ్  ఇంట్లో కూర్చొంటారనే అభిప్రాయంతో  ప్రభుత్వం ఉందా  అని  రాజాసింగ్  ప్రశ్నించారు.  గతంలో  కూడా  బండి సంజయ్ ను జైలుకు  పంపారన్నారు. ఆ సమయంలో కూడా  బండి సంజయ్ భయపడలేదన్నారు. 

also read:బండి సంజయ్ అరెస్ట్: తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్

 ఇప్పుడు అరెస్టు చేస్తే  భయపడతారా అని  రాజాసింగ్  ప్రశ్నించారు.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్  చేస్తారా అని  రాజాసింగ్  ప్రశ్నించారు. బండి  సంజయ్ కు తెలంగాణ ప్రజలు  మద్దతుగా  నిలబడుతారని  రాజాసింగ్  చెప్పారు.  టెన్త్  క్లాస్ ప్రశ్నాపత్రాల లీక్ తో  విద్యార్ధుల  జీవితాలతో  రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని  రాజాసింగ్  ఆరోపించారు. 

click me!