బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై తెలంగాణ హైకోర్టులో కమలం నేతలు పిటిషన్ దాకలు చేశారు
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ . ఈ పిటిషన్ లో ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చింది బీజేపీ. హోంశాఖ సెక్రటరీ , డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీ, రాచకొండ సీపీ, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.బీజేపీ నేత సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారంనాడు రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అర్ధరాత్రి కరీంనగర్ నుండి యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
undefined
also read:బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్.. లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు
వరంగల్ లో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అయింది . పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడని బీఆర్ఎస్ ఆరోపించింది. లీకైన టెన్త్ క్లాస్ పేపర్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా చేరిందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ విషయమై నిన్న రాత్రి కరీంనగర్ లో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ నుండి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.