ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదు.. కేసీఆర్ శిక్షణ ఇప్పించాలి : రాజాసింగ్

By Siva Kodati  |  First Published Sep 2, 2023, 8:21 PM IST

బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.  ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదని దుయ్యబట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని రాజాసింగ్ హితవు పలికారు. 


బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తమాషాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని.. అర్హులకు కాకుండా అనర్హులు, బీఆర్ఎస్‌కు సంబంధించిన వారికే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన నియోజకవర్గంలోనూ అర్హత లేని వారికి ఇళ్లు ఇచ్చారని.. ఈ ఇళ్లను పీఎంఏవై కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని ఆయన ఎద్దేవా చేశారు. కానీ వీటిని తామే నిర్మించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని రాజాసింగ్ చురకలంటించారు. 

కేసీఆర్ పాలనలో తెలంగాణ మత్తుల తెలంగాణగా మారిందన్నారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదని దుయ్యబట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని రాజాసింగ్ హితవు పలికారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారని, అందుకే తాను వేదికపై నుంచి వచ్చేశానని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. 

Latest Videos

ALso Read: బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయ్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ఇదిలావుండగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వివరించారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కు సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు తమ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం పై బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రైవేట్ ఆస్తి కాదని ఫైర్ అయ్యారు. కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లుతున్న బీజేపీ నేత రమణా రెడ్డి, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. 

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, వారి బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను వేధించడం మొదలు పెట్టిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలు కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లితే కేసీఆర్‌కు ఎందుకు భయం అని అడిగారు. 
 

click me!