కేసీఆర్‌కు రాజాసింగ్ ఆఫర్: టీఆర్ఎస్‌లో చేరతా, ఈ షరతులకు ఒప్పుకుంటారా..?

Siva Kodati |  
Published : Apr 15, 2019, 08:59 AM IST
కేసీఆర్‌కు రాజాసింగ్ ఆఫర్: టీఆర్ఎస్‌లో చేరతా, ఈ షరతులకు ఒప్పుకుంటారా..?

సారాంశం

టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేకిత్తిస్తున్నాయి

టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేకిత్తిస్తున్నాయి.

శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌లో శ్రీరామ శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వద్ద జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. నేడు దేశంలో జై శ్రీరామ్ అనడం కూడా మతపరమైనదిగా మారిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌కు తాను ఒక ఆఫర్ ఇస్తున్నా.. తాను టీఆర్ఎస్‌లోకి చేరడానికి సిద్ధం.. అయితే అందుకు ఒక షరతు ... అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మతమార్పిడులకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో మీరు కలిసి వస్తారా అని ప్రశ్నించారు.

10 నుంచి 20 నిమిషాల సమయం తమకు ఇస్తే దేశంలో ఉన్న దేశ ద్రోహులను తరిమి కొడతామన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు నడుం బిగించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.

అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత కాశీ, మధురలోనూ మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారత్ మాతాకీ జై... వందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే