సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

Published : Apr 14, 2019, 04:59 PM IST
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

సారాంశం

 శ్రీరామనవవిమ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది. 

కోదాడ: శ్రీరామనవవిమ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు.

ఖమ్మం వైపు నుండి కోదాడ వైపు ఆటోలో వస్తుండగా ఓ సిమెంట్ లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది  ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం.

క్షతగాత్రులను కోదాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే