సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య: ప్రియుడే హంతకుడు

Siva Kodati |  
Published : Apr 14, 2019, 05:19 PM IST
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య: ప్రియుడే హంతకుడు

సారాంశం

హైదరాబాద్ సూరారంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య దారుణహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమెను ప్రియుడు సునీల్ కుమారే హత్య చేసినట్లు గుర్తించారు

హైదరాబాద్ సూరారంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య దారుణహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమెను ప్రియుడు సునీల్ కుమారే హత్య చేసినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే... సురేంద్రనగర్‌కు చెందిన సునీల్ కుమార్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్యలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే ఈ జంట పెళ్లికి ముందే శారీరకంగా ఒక్కటైంది. ఈ క్రమంలో లావణ్య పెళ్లి గురించి పలుమార్లు సునీల్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సునీల్.. లావణ్య హత్యకు కుట్ర పన్నాడు.

పథకం ప్రకారం ఆమెను మాట్లాడుకుందామని ఓ హోటల్‌కు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అత్యంత దారుణంగా చంపి, మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో వేసి.. కాలువలో పడేశాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి రెండు రోజులవుతున్నా లావణ్య కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ప్రియుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే