గొర్రెకుంటలో 9 మంది హత్య: సంజయ్ కు ఉరిశిక్ష విధించిన కోర్టు

Published : Oct 28, 2020, 02:06 PM ISTUpdated : Oct 28, 2020, 04:54 PM IST
గొర్రెకుంటలో 9 మంది హత్య: సంజయ్ కు ఉరిశిక్ష విధించిన కోర్టు

సారాంశం

వరంగల్: గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో దోషి సంజయ్ కుమార్ కు వరంగల్  అదనపు సెషన్స్  కోర్టు బుధవారం నాడు ఉరిశిక్ష విధించింది  

వరంగల్: గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో దోషి సంజయ్ కుమార్ కు వరంగల్  అదనపు సెషన్స్  కోర్టు బుధవారం నాడు ఉరిశిక్ష విధించింది

ఈ ఏడాది మే 21వ తేదీన సంజయ్ కుమార్ 9 మందిని హత్య చేశాడు. ఈ ఏడాది మే 21వ తేదీన గొర్రెకుంటలో ఆలం కుటుంబానికి చెందిన సభ్యులు  ఏడుగురు, బీహార్ కు చెందిన శ్యాం, శ్రీరామ్ లు మరణించారు. వీరిని  సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేసి. గొర్రెకుంట బావిలో వేశాడు. 

also read:తొమ్మిది మందిని నేనే చంపా: గొర్రెకుంట హత్యలపై కోర్టులో సంజయ్

ఒక హత్య ను కప్పిపుచ్చేందుకు 9 మందిని సంజయ్ కుమార్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.25 రోజుల్లోనే ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. 57 మంది వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు కేసు నుండి తప్పించుకోకుండా పోలీసులు పక్కాగా సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరిశిక్షను విధించింది.

ఈ కేసులో నిందితుడిగా సంజయ్ కుమార్ ను 72 గంటల్లో గుర్తించారు. నిందితుడు సంజయ్ కు ఉరిశిక్ష పడాలని వాదించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే ఈ హత్యలు చేసినట్టుగా జడ్జి ముందు నిందితుడు సంజయ్ కుమార్ ఒప్పుకొన్నాడు.ఈ కేసులో నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో నిరూపించాడు. నేరం రుజువైందని జిల్లా కోర్టు ప్రకటించింది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే