
తెలంగాణ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉన్న రెండు స్కీమ్ లను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో మెజారిటీ ప్రజలు లబ్దిదారులుగా ఉండే రెండు పథకాలు ఉన్నాయి. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల కావడానికి ముందే వీటిని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
అయోధ్యలో రామ మందిరం: భారత జవాన్లతో కలిసి జై శ్రీరామ్ అంటూ చైనా ఆర్మీ నినాదాలు, వీడియో వైరల్
మహాలక్ష్మీ గ్యారెంటీలో భాగంగా ఉన్న రూ.500లకే సబ్సిడీ సిలిండర్లను హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అర్హులైన మహిళలకు అందించాలని అనుకుంటోంది. అలాగే ఇదే గ్యారెంటీలో ఉన్న నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే మరో స్కీమ్ ను కూడా అమలు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రబుత్వం సన్నధమవుతోంది. ఇటీవల దావోస్, లండన్, దుబాయ్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి మహాలక్ష్మి గ్యారెంటీల్లో భాగమైన ఈ రెండు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు ‘డెక్కన్ క్రానికల్’ కథనం పేర్కొంది.
కాగా.. గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రూ.500 సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కోసం మొత్తం 91.49 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 92.23 లక్షల మంది మహిళలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన హామీల కంటే సబ్సిడీ గ్యాస్, ఆర్థిక సాయం వంటి పథకాల కోసమే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం.
Hyderabad Metro Rail: మెట్రో ఫేజ్ 2 రూట్స్ ఖరారు.. ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే..
లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప్రకటనకు ముందే మహాలక్ష్మి పథకంలోని రెండు అంశాలను అమలు చేయాలన్నది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. ఆరు గ్యారెంటీ అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మంత్రివర్గ ఉప సంఘం ఫిబ్రవరి మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను రూపొందించిన తర్వాత మహిళా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి పరిశీలన ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
సమాజంలో మహిళలకు ప్రోత్సాహం, అభ్యున్నతే లక్ష్యంగా చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఈ మహాలక్ష్మీ గ్యారెంటీని అమలు చేస్తామని తెలిపింది. ఇందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.2500 ఆర్థిక సాయం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఉచిత బస్సు పథకం ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది. మరో రెండు స్కీమ్ లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.