మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇకపై బార్లలోనూ క్వార్టర్, హాఫ్‌ బాటిళ్ల అమ్మకాలు..!

By Asianet News  |  First Published May 11, 2023, 9:36 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి క్వార్టర్, హాఫ్‌ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే నిబంధనలు సవరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. 


తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇంత వరకు వైన్ షాపుల్లో మాత్రమే అందుబాటులో ఉండే లిక్కర్ క్వార్టర్, హాఫ్‌ బాటిళ్లు ఇకపై బార్లలోనూ లభించనున్నాయి. దీని కోసం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నిబంధనల్లో మార్పు తీసుకొచ్చింది. ఇందులో బార్లకు కూడా ఆర్థిక ఊతం అందించేలా పలు నిబంధలను సవరించింది. కరోనా తరువాత ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

తన భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని మహిళపై ఎస్ఐ దాడి.. జగిత్యాలలో ఘటన

Latest Videos

అందులో భాగంగా బార్ల లైసెన్సింగ్‌ విధానాన్ని కూడా సులభం చేసింది. అలాగే బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ రుసుము చెల్లింపుల్లో వెసులుబాటు వంటి చర్యలు తీసుకుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్లలో క్వార్టర్, హాఫ్‌ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇదేం సరదా.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టిన స్నేహితుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

కాగా.. ఈ నిర్ణయంపై వైన్ షాప్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లలో ఈ బాటిళ్లు అందుబాటులోకి వస్తే తమ అమ్మకాలు తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ఇప్పటికే 2బీ లైసెన్సుల ప్రకారం స్టార్ హోటల్స్ ఆ బాటిళ్లు లభిస్తున్నాయని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చెబుతోంది. ఆ నిబంధనలను ఇప్పుడు మామూలు బార్ అండ్ రెస్టారెంట్లకు అమలు చేస్తున్నామని పేర్కొంటోంది. దీని వల్ల ఇటు వినియోగదారుడికి, అటు తయారీదారుడికి సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది.

click me!