జూన్‌లో తెలంగాణకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ.. టీ.కాంగ్రెస్‌లో జోష్

Siva Kodati |  
Published : May 10, 2023, 08:57 PM IST
జూన్‌లో తెలంగాణకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ.. టీ.కాంగ్రెస్‌లో జోష్

సారాంశం

జూన్ మొదటివారంలో హైదరాబాద్‌కు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా , రాహుల్, ప్రియాంక గాంధీ. బోయిన్‌పల్లిలో గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్‌కు వారు శంకుస్థాపన చేయనున్నారు. 

జూన్ మొదటివారంలో హైదరాబాద్‌కు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా , రాహుల్, ప్రియాంక గాంధీ. బోయిన్‌పల్లిలో గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్ భవనానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజున 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ అందజేయనున్నారు కాంగ్రెస్ నేతలు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌లో వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోందని ఆరోపించారు. ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని రేవంత్ పేర్కొన్నారు. వర్షాకాలంలో కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బోర్డు సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేయాలని కోరామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. 

ALso Read: కేసీఆర్ కాళ్లు పిసికినంత సులభం కాదు: తలసానికి రేవంత్ కౌంటర్

అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రేవంత్ రెడ్డి  ఫైరయ్యారు. నిన్న  తనపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చేసిన విమర్శలపై  రేవంత్ రెడ్డి  కౌంటర్ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్  చాలా కాలం పాటు దున్నపోతులు  కాశాడన్నారు. పెండ పిసికి ...పిసికి   పిసుకుతానని  తలసాని వ్రీనివాస్ యాదవ్ అంటున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ ల  చెప్పులు  మోసినా కూడా  తన మాదిరిగా  ఒక పార్టీకి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్  అవుతాడా అని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

పాన్ పరాగ్ లు తినే  వ్యక్తి కూడా తన గురించి మాట్లాడుతాడా అని తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌పై   రేవంత్ రెడ్డి  మండిపడ్డారు. అరటి పండ్ల బండి వద్ద  మేక నమిలినట్టుగా  పాన్ పరాగ్ లు నమిలడం  మానుకోవాలని  ఆయన మంత్రికి హితవు పలికారు.  ప్రజా ప్రతినిధులుగా యువతకు  ఆదర్శంగా ఉండాలని రేవంత్ రెడ్డి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సూచించారు . మంత్రిగా ముందు  తన బాధ్యతను గుర్తెరగాలని  రేవంత్ రెడ్డి  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  హితవు పలికారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !