కంచ ఐలయ్యకు మద్దతుగా గొల్లకుర్మ డోలు దెబ్బ

First Published Sep 21, 2017, 6:27 PM IST
Highlights
  • ఐలయ్య రాసిన దానిలో ఈసమంత తప్పులేదు
  • ఎపి తెలంగాణలో ఐలయ్యకు మద్దతుగా కార్యక్రమాలు
  • టిజి వెంకటేష్ వ్యాఖ్యలకు ఖండన
  • కంచ అభినవ అంబేడ్కర్

ప్రపంచ ప్రఖ్యాత రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మద్దతుగా గొల్లకురుమ డోలుదెబ్బ ఉంటుందని ప్రకటించారు ఆ సంఘం రాష్ట్ర నాయకుడు బెల్లి చంద్రశేఖర్ యాదవ్. కంచ ఐలయ్యకు మద్దతుగా అన్ని జిల్లాలో, మరియు మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కంచ ఐలయ్య మీద మెధోశక్తి తో గెలవలేని వాళ్ళు  గాలి మాటలు మాట్లాడుతూ అణగారిన కులాల ఆత్మగౌరవాన్ని అవమనపరుస్తూన్నారని ఆరోపించారు. అలాంటి వారిపై  కఠిన చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి  తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు.

పది పేజీల  పుస్తకంలో దోపిడీ వ్యవస్థను ప్రశ్నించారు కంచ ఐలయ్య. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే మాట తిట్టినట్టు కాదని, వాళ్ళు చేసే పని విధానాన్ని సూచించే మాట అని గుర్తు చేశారు. ఈ సమాజంలో దొరికే ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. ఆ విషయాన్ని మరొక్క సారి బట్టబయలు చేసిన వారిపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులను దగ్గరికి వెళ్లి తెల్ల చిట్టి మీద వ్యాపారులు ధర  నిర్ణయించి  మోసం చేస్తూ వొస్తున్న విషయాన్ని ఐలయ్య వివరంగా తెలిపారు. అదే సమయంలో రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు ఇస్తారు, అదికూడా వ్యాపారులు నిర్ణయించిన ధరకే. ఇది దోపిడీ కాదా అని ప్రశ్నించారు. దోపిడీ ఈ విధంగా ఎన్నో రకాలుగా కొన్ని వేల సంవత్సరాల నుండి చేస్తూ వొస్తున్నారనే విషయాన్ని ఐలయ్య తేటతెల్లం చేశారన్నారు. మరి అటువంటప్పుడు సమాజంలో  వుంటూ  దోపిడీ చేస్తున్న వాళ్ళని  సామాజిక స్మగ్లర్లు అనకుండా ఇంకా ఎమంటారని ప్రశ్నించారు.

సమాజ చరిత్ర ని తవ్వుతూ విశ్లేషిస్తున్న అభినవ అంబేడ్కర్ కంచ ఐలయ్య అని ప్రశంసించారు. ఎన్నో విషయాలపై కంచ ఐలయ్య పరిశోధన చేస్తూ రచనలు చేసి నిజాలను ప్రజల ముందు ఉంచుతున్నారని తెలిపారు. నిజంగా దోపిడీదారులకు ఈ విషయం మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఇంత రాద్ధతం చేస్తున్నారని ఆరోపించారు. టీ జీ వెంకటేష్ లాంటి వాళ్ళు తమ ఆస్తులను వ్యాపారాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వాలకు పన్ను ఎగ్గొట్టడుతున్నారని ఆరోపించారు. దానికోసమే అన్ని రాజకీయ పార్టీలకు చందాలు ఇస్తుంటారని తెలిపారు. నిజాలను ప్రజల ముందు ఉంచిన వారిపై నిందలు వేయడం, నది రోడ్డుపై ఉరి తీయాలి అని నీచంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!