గోదావరికి మరోసారి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
హైదరాబాద్: Godavari నదికి మరోసారి వరద ప్రవాహం పెరుగుతుంది. Bhadrachalam వద్ద గోదావరి నది 40 అడుగులకు చేరింది.భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గోదావరి నదికి ఎగువన ఉన్న ఉపనదులకు వరద పోటెత్తిన కారణంగా గోదావరికి కూడా వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు గ్రామాల ప్రజలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. గోదావరి వరద ప్రవాహం తగ్గుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాల నుండి ముంపు గ్రామాల ప్రజలు తమ ఇళ్లకు చేరుకొని వరద కారణంగా వచ్చిన బురదను శుభ్రం చేసుకొంటున్నారు. ఈ సమయంలో మరోసారి గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో సాధారణంగా గోదావరికి వరదలు వస్తాయి. దీంతో ప్రజలు ఆందోళనగా ఉన్నారు. రానున్న రోజుల్లో వరద పోటెత్తితే ఏ రకంగా వ్యవహరించాలనే విషయమై కూడా రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
undefined
గత 10 రోజుల క్రితం గోదావరి నదికి వరద పోటెత్తింది.Dowleswaram వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. సుమారు 20 లక్షలకు పైగా వరద నీరు సముద్రంలోకి విడుదలైంది. 1986 తర్వాత యానాంలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. 1986 కంటే ఎక్కువ వరద గోదావరికి వచ్చిందని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు చెబుతున్నారు. 1986లో గోదావరి నదికి వచ్చిన వరద కారణంగా భద్రాలచం వద్ద వరద 75.6 అడుగులుగా నమోదైంది.
also read:తెలంగాణలో ఐదు గ్రామాలను కలపాలి:భద్రాచలం వద్ద ఏపీ వాసుల రాస్తారోకో
అయితే ఈ ఏడాది మాత్రం గోదావరికి వచ్చిన వరద 71 అడుగులు దాటింది. వరద ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను తరలించారు. సుమారు 5 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణానికి కరకట్ట నిర్మించడంతో వరద నీరు పట్టణంలోకి ప్రవేశించలేదు. అయితే కరకట్ట లేని చోట వరద నీరు చేరుకొంది. దీంతో భద్రాచలంలోని సుభాష్ నగర్ తో పాటు పలు కాలనీల ప్రజలు తమకు కూడా కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు.
దాదాపుగా 13 రోజుల తర్వాత గోదావరి నదికి వరద నిన్న తగ్గింది. అయితే ఉప నదులకు వరద పోటెత్తడంతో క్రమంగా గోదావరి నదికి వరద పెరుగుతుంది. ఇవాళ గోదావరి నది భద్రాచలం వద్ద 40 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది. అయితే ఎగువ నుండి వరద మరింత పెరిగే భద్రాచలం వద్ద కూడా వరద పెరిగే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు.