Lal Darwaza Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి.. లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు

Published : Jul 24, 2022, 11:26 AM IST
Lal Darwaza Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి.. లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు

సారాంశం

భాగ్యనగరం బోనమెత్తింది. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర వైభవంగా సాగుతుంది. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి.

భాగ్యనగరం బోనమెత్తింది. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర వైభవంగా సాగుతుంది. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. మాజీమంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ దంపతులు మొదటి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి భోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పీవీ సింధు బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయితే గతకొంతకాలంగా పీవీ సింధు.. అమ్మవారికి భోనం సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది టోర్నమెంట్ కారణంగా.. అమ్మవారికి భోనం సమర్పించలేకపోయారు. 

అమ్మవారికి భోనం సమర్పించిన అనంతరం సింధు మాట్లాడుతూ.. తనకు బోనాల పండగ అంటే ఇష్టమని చెప్పారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. అయితే గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఈ సారి అమ్మవారిని దర్శించుకుని భోనం సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ రోజు లండన్ వెళ్లనున్నట్టుగా చెప్పారు. 

Also Read: హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్.. వివరాలు ఇవే..

బోనాల నేపథ్యంలో లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వర్షం కురిస్తే భక్తులు తడవకుండా రక్షణ పొందేందుకు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?