
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తమ ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని Bhadrachalam వద్ద ఉన్న Andhra Pradesh, Telangana రాష్ట్రాల సరిహద్దుల వద్ద రాస్తారోకో నిర్వహించారు.
Godavariకి ఇటీవల వరదలు రావడంతో ఈ ఐదు గ్రామాలు నీటిలో ముంపునకు గురయ్యాయి. ఈ ఐదు గ్రామాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.. ఈ విషయమై కొన్ని రోజులుగా ఏపీ సరిహద్దుల్లో ఈ గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ప్రాంతంలో ఆందోళనలు నిర్వహించడంపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఏపీ సరిహద్దు నుండి భద్రాచలానికి సమీపంలోని తెలంగాణ సరిహద్దుకు వచ్చిన ఈ ఐదు గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు.భద్రాచలం అభివృద్ది చెందాలన్నా తమకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఈ ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పిచ్చుకల గూడెం, కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాలను ఏపీ నుండి తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. భద్రాచలం వద్ద ఉన్న కరకట్ట విస్తరణ చేయాలంటే ఈ ఐదు గ్రామాలు కూడా తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉంది.ఈ విషయమై ఈ గ్రామాల వద్ద కరకట్ట నిర్మాణం కోసం ఏపీ ప్రజలతో మాట్లాడుతామని కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష తర్వాత మీడియా సమావేఁశంలో KCR ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఐదు గ్రామాలను తమ రాష్ట్రంలో కలపాలని కూడా తెలంగాణకు చెందిన TRS ప్రజా ప్రతినిధులు కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే
also read:మంజీరాకు పోటెత్తిన వరద: ఏడుపాయల ఆలయం తాత్కాలికంగా మూసివేత
రాష్ట్ర విభజన సమయంలో పోలవరం నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఏపీ ప్రభుత్వంలో ఏడు మండలాలను కలిపారు. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉండే ఈ ఐదు గ్రామాలు కూడా ఏపీలో విలీనమయ్యాయి.ఈ గ్రామాలకు ఏపీ కంటే తెలంగాణలోని భద్రాచలం సమీపంలో ఉంటుంది. అయితే ఇటీవల వచ్చిన వరదలతో ఈ ఐదు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.ఈ విషయమై గత వారంలో ఈ ఐదు గ్రామపంచాయితీలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేశాయి. ఐదు గ్రామాలను ఏపీ నుండి తెలంగాణలో కలపాలని ఆందోళనలకు దిగారు. ఇవాళ భద్రాచలానికి సమీపానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ ఐదు గ్రామాల ప్రజల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ ఐదు గ్రామాలను తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసిి మరీ ఈ డిమాండ్ చేశారు. పోలవరం పెంపు విషయమై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు కారణంగానే భద్రాచలం ముంపునకు గురైందని ఆయన ఆరోపించారు.