వివరణకు మరికొంత సమయం ఇవ్వండి : రాజాసింగ్ భార్య ఉషాబాయి

By Bukka SumabalaFirst Published Sep 2, 2022, 8:38 AM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరికాస్త సమయం ఇవ్వాలని.. ఆయన జైలులోనే ఉన్నారని కోరుతూ.. భార్య ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తతలకు కారణమైన రాజాసింగ్ కు ఎందుకు అరెస్ట్ చేయవద్దో చెప్పమంటూ అధిష్టానం అడిగిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. బిజెపి క్రమశిక్షణ కమిటీ.. రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ ఆయనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ గడువు రేపటితో ముగియనుండడంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీకి ఉషాబాయి లేఖ రాశారు. రాజాసింగ్ జైలులో ఉన్నారని తన సస్పెన్షన్ రేపటితో ముగియనుండటంతో సమయం ఇవ్వాలని కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ని ఇటీవల పీడీ చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు. 

ఇదిలా ఉండగా, మహమ్మద్ ప్రవక్త పై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఆగస్టు 30న మండిపడ్డారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని ఆరోపించారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అధికార పార్టీ తెలంగాణ యూనిట్ షోకాజ్ నోటీసులు పంపించింది. అనేక ఎఫ్ఐఆర్ లు, నగర వ్యాప్తంగా నిరసనలు, ఆగస్టు 23న అతని అరెస్టుకు విఫలయత్నం చేసిన తర్వాత..  చివరకు ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ ను నగర పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ-ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా?.. గత అనుభవం ఏం చెబుతుంది?

అయితే, బీజేపీ నుంచి రాజా సింగ్ ను సస్పెండ్ చేయడం  కాషాయ పార్టీ ఆడుతున్న డ్రామా అని ఓవైసీ ఆరోపించారు. ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు ఆయన విడుదలకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో  టిఆర్ఎస్ ఉండడంవల్లే రాజాసింగ్ ను కటకటాల వెనక్కి నెట్టారని ఓవైసీ స్పష్టం చేశారు. మహమ్మద్ ప్రవక్త పై దైవదూషణకు పాల్పడి ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా ఢిల్లీలో బిజెపి నియంత్రణలో ఉన్న పోలీసులు కాకపోతే కటకటాల వెనక ఉంటారని కూడా అన్నారు. బీజేపీ ప్రభుత్వం నూపుర్ శర్మను అరెస్టు చేయడానికి బదులు ఆమెకు భద్రత కల్పిస్తుందని ఓవైసీ ఆరోపించారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఆందోళనలు, నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాసింగ్ పై అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అవి మరింత ముదిరాయి. పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రాజాసింగ్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే బిజెపికి చెందిన పలువురు నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమయ్యారు. 

click me!