కాంగ్రెస్‌లోకి: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత బీఆర్ఎస్‌కు రాజీనామా

By narsimha lodeFirst Published Feb 25, 2024, 6:37 AM IST
Highlights


బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి నుండి  నేతలు  కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు.

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామా చేశారు.  శ్రీలతతో ఆమె భర్త శోభన్ రెడ్డి కూడ బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు  బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షపదవికి  రాజీనామా చేశారు.

ఇటీవలనే  శ్రీలత దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డిని కలిశారు.  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో  గులాబీ పార్టీకి  రాజీనామా చేశారు.  బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న  నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది.  జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ డిప్యూటీ మేయర్  బాబా ఫసియుద్దీన్ తదితరులు  ఇటీవలనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీలత దంపతులు  కూడ  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Latest Videos

పార్లమెంట్ ఎన్నికల నాటికి  సంస్థాగతంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం  ఫోకస్ పెట్టింది.  అసెంబ్లీ ఎన్నికల్లో   జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి  ఒక్క సీటు కూడ దక్కలేదు. దీంతో  జీహెచ్ఎంసీ పరిధిలోని  అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తుంది. 

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే  తీగల కృష్ణారెడ్డి  అతని కోడలు తీగల అనితారెడ్డి శనివారం నాడు  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తీగల కృష్ణారెడ్డి కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి  పట్నం మహేందర్ రెడ్డి సతీమణి  వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్  పట్నం సునీతా మహేందర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ నెల  27న చేవేళ్లలో జరిగే  బహిరంగ సభలో  నేతలంతా  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

 

click me!