రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. GO 317 సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ !  

By Rajesh Karampoori  |  First Published Feb 25, 2024, 3:42 AM IST

GO 317 : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో 317 పై తలెత్తినటువంటి ఉద్యోగుల అభ్యంతరాలు, వివాదాలన్నింటిని కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఓ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చైర్మన్ గా, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కమిటీల సభ్యులుగా ఓ సబ్ కమిటీ ఏర్పాటు అయింది. 


GO 317 : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 317 సమస్యలను పరిష్కరించి, సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్‌గా ఉండగా, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు.  రాష్ట్ర జిఏడి ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ జీవో 317  సంబంధించిన అన్ని అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించి ప్రభుత్వానికి  సిఫార్సులు చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంతకీ GO 317 అంటే..? 

Latest Videos

undefined

2021లో కేసీఆర్ ప్రభుత్వం GO 317 ను తీసుకవచ్చింది. ఈ జీవో ప్రకారం .. ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను.. నూతనంగా ఏర్పాటు చేసిన 33 జిల్లాలకు అనుగుణంగా విభజించింది. ఇలా చేయడం వల్ల పలు శాఖలోని ఉద్యోగులు బదిలీ కావాల్సి వచ్చింది.  ఈ జీవో అములుతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందనీ చాలా మంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

సమస్యాత్మక 37 జీవోను సమీక్షించి, తమ ఇబ్బందులను పరిష్కరించాలని బాధ్యత ఉద్యోగులకు కోరుతున్నారు. తాము తమ కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనేకమంది ఉద్యోగులను అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. జీవో 370ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో పాటు ప్రచారంలో కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తవించింది. 

ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం దీనిపైన ముందుగా  క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.  సమస్య కారణమేంటి?  సమస్య ఎందుకు తలెత్తింది?  దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు? ఉద్యోగులను మార్చాల్సి వస్తే.. ఏ విధంగా చేయాలి? ఇవన్నీ కూడా అధ్యయనం చేసి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది.  ఈ సమస్యపై వీలైనంత త్వరగా నివేదిక ఇస్తే.. ఆ  సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అధికారులతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి.. క్యాబినెట్ సబ్ కమిటీ జీవో 317 పై అధ్యయనం చేసి నివేదిక ఇస్తే.. అతి త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 

click me!