Sharmila Son Wedding Reception: వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. అలాగే.. హైదరాబాద్‌లో జరిగిన ఈ రిసెప్షన్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
Sharmila Son Raja Reddy Marriage Reception: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. రాజా రెడ్డి-ప్రియల మ్యారేజ్ రిసెప్షన్ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు.
అలాగే.. హైదరాబాద్‌లో జరిగిన ఈ రిసెప్షన్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, వేణుగోపాల్‌లకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
కనిపించని ఏపీ సీఎం జగన్!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగిన వివాహానికి షర్మిల సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గైర్హాజరైన విషయం తెలిసిందే. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్‌లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ పార్టీకి సైతం వైఎస్ జగన్ హాజరు కాలేదు. అంతకుముందు గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయారు. స్వంత మేనల్లుడి పెళ్లికి కానీ, రిసెప్షన్ కి కానీ హాజరుకాకపోవడం చర్చనీయంగా మారింది.
రాజస్థాన్‌లో వివాహం..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు ఫిబ్రవరి 17న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉమేద్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహిత బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక నిర్వహించారు. మరుసటిరోజు క్రైస్తవ సాంప్రదాయంలోనూ రాజారెడ్డి, ప్రియల వివాహం ఘనంగా జరిగింది. ప్రియా అట్లూరి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రాజారెడ్డితో ఆమె నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది.