Huzurabad Bypoll : ‘సొంత వాహనం కూడా లేదు’.. అఫిడవిట్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్..

By AN TeluguFirst Published Oct 2, 2021, 10:59 AM IST
Highlights

గెల్లు శ్రీనివాస్  రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన  వివరాలు ఆసక్తికరంగా మారాయి. తన వద్ద కేవలం 10 వేల రూపాయలు,  తన భార్య వద్ద కేవలం ఐదు వేల రూపాయల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. 

హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో (Huzurabad Bypoll) టీఆర్ఎస్ అభ్యర్థిగా(TRS candidate) పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav)కు సొంత వాహనం కూడా లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.  ఇక తన చేతిలో కేవలం పది వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. గెల్లు శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

గెల్లు శ్రీనివాస్  రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన  వివరాలు ఆసక్తికరంగా మారాయి. తన వద్ద కేవలం 10 వేల రూపాయలు,  తన భార్య వద్ద కేవలం ఐదు వేల రూపాయల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. 

అదేవిధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు.  వీటితో పాటు వీణవంక లో సొంత ఇల్లు, 10.25 గుంటల స్థలం విలువ రూ. 20 లక్షలుగా చూపించారు.  అలాగే గెల్లు శ్రీనివాస్ కు  సొంత వాహనం,  కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం.

 పేరు :  గెల్లు శ్రీనివాస్ యాదవ్
 విద్యార్హతలు : ఎం ఏ,  ఏ ఎల్ ఎల్ బి
 భార్య : గెల్లు శ్వేత
కేసులు :  3

ఇదిలా ఉండగా, హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) పేరును పార్టీ ఖరారు చేసింది. అధిష్టానం ఆమోదం అనంతరం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థి ఎంపికమీద శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చినా.. అధికార టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్ పేరును కాంగ్రెస్ ముఖ్యులు ప్రతిపాదించారు. 

Huzuarabad By Poll : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్..

రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. వెంకట్ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యలు ఆయనను పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం ఖరారు చేశారు. శనివారం టీపీసీసీ చేపట్టనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సందర్భంగా వెంకట్ పేరును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

click me!