మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500లకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల నుంచే అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా డిసెంబర్ 28న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని యోచిస్తోంది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ముందుగా ఆరు గ్యారెంటీలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే మహాలక్షీ పథకంలో భాగంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అలాగే మరో హామీ అయిన ఆరోగ్య శ్రీ ఆరోగ్య బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఇప్పుడు మరో పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
141 మంది ఎంపీల సస్పెన్షన్ పై ఖర్గే ఫైర్.. బీజేపీ ఒకే పార్టీ పాలన ఉండాలని చూస్తోందంటూ వ్యాఖ్యలు..
అదే రూ.500కే గ్యాస్ సిలిండర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలు ఈ పథకం అమల్లోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి కూడా ముహుర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం విధి విధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
నేటి నుంచి శాసనసభ సమావేశాలు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రభుత్వం రెడీ.. ఎందుకంటే ?
దీంతో ఈ పథకానికి అర్హులు ఎవరు ? వారిని ఏ ప్రతిపాదికన గుర్తించాలి ? మహిళలకే ఇవ్వలా ? లేక ఎవరి పేరు మీద కనెక్షన్ ఉన్నా ఇవ్వాలా ? కుటుంబ ప్రతిపాదికన ఇవ్వాలా లేక కుటుంబంలో ఎన్ని కనెక్షన్లు ఉన్నా ఇవ్వాలా ? అనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎల్పీజీ కనెక్షన్లు ఎన్ని ? ప్రభుత్వం రూ.500 కే సిలిండర్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తే రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంత అనే అంశాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1 కోటి 20 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇందులో నెలకు 60 లక్షల సిలిండర్లు రీఫిల్ అవుతున్నాయి. అయితే రూ.500 కే గ్యాస్ కే సిలిండర్ అందజేస్తే.. దాదాపు రాష్ట్ర ఖజానాపై రూ.3వేల కోట్లకు పైగా భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.