Karimnagar : ఒక్క మూగజీవి కోసం రిస్క్ లో పడ్డ 13 ప్రాణాలు... చివరకు ఇద్దరు దుర్మరణం

By Arun Kumar P  |  First Published Dec 20, 2023, 2:13 PM IST

కరీంనగర్ జిల్లా వేములవాడలో ఓ కోతి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  13 మందితో వెళుతున్న ఆటో బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. 


కరీంనగర్ : ఓ కోతి ప్రాణాలు కాపాడబోయి 13 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టాడో డ్రైవర్. అడ్డంవచ్చిన కోతి క్షేమంగానే వుంది... కానీ ఆటో బోల్తాపడి ఇద్దరు మహిళా రైతు కూలీలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా వుండగా మరికొందరు కూడా గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా ఒక్క కోతి చాలామంది ప్రాణాలమీదకు తెచ్చింది.  

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా వేములవాడ శివారులోని చింతల్ ఠాణాకు చెందిన మహిళా కూలీలు వరినాట్ల కోసం చందుర్తి మండలం మర్రిగడ్డకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఇలా 13మందితో ఆటో వేగంగా వెళుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది.

Latest Videos

ఎక్కడినుండి వచ్చిందో ఏమో ఓ కోతి ఒక్కసారిగా మంచివేగంతో వెళుతున్న ఆటోకు అడ్డువచ్చింది. దీంతో ఆ కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. పల్టీలు కొడుతూ ఆటో బోల్తాపడటంతో అందులోని ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల ఆర్థనాదాలు, రక్తపు గాయాలు, చెల్లాచెదురుగా పడ్డ వస్తువులు, తుక్కుతుక్కయిన ఆటోతో ఘటనాస్థలం భయానకంగా మారింది. 

Also Read  రేవంత్ ను ఓడించేందుకు అంత పని చేసాారా..? పరారీలో మాజీ డిప్యూటీ మేయర్, పోలీసుల గాలింపు

ఏం జరిగిందో అర్థమై తేరుకునేలోపే ఓ మహిళ మల్లవ్వ(55) ప్రాణాలు కోల్పోయింది.  తీవ్రంగా గాయపడ్డ మరో మహిళ బాలవ్వ(60) కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.మరో నలుగురి పరిస్థితి విషమంగా వుందని... మిగతావారు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురయినవారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాదం నెలకొంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారు కోతి కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 


 

click me!