
అపార్టుమెంట్లు అంటేనే కాంక్రీటు జంగిళ్లు.. పచ్చదనం మచ్చుకైనా కనిపించదు.. కానీ, గోల్కొండ లోని వైకే రెసిడెన్సీ అపార్టుమెంట్ లో ఉన్న ఆ ప్లాట్ కి వెళితే ప్రతి రూంలోనూ పచ్చదనమే.. కానీ, ఆ పచ్చదనం వెనక ఓ పచ్చి నిజం కూడా ఉంది.
అతడు సాగుచేస్తున్నది కలబంద మొక్కలో, తులసీ మొక్కలో కాదు.. గంజాయి మొక్కలు..
అడవుల్లో రహస్యంగా పెంచే గంజాయిని తన ఇంట్లో దర్జాగా పెంచుకుంటున్నాడు సయ్యద్ అనే మోసగాడు. అంతేకాదు విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్నాడు.
ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా చేయడం కష్టమైన పని, సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో ఈ కొత్త మార్గాన్ని సయ్యిద్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయం తెలిసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. అతడి ప్లాట్ ను పరిశీలించిన వారు 60 కుండీలలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను సాగుచేస్తున్నారు.
దాదాపు 6 నెలల నుంచి సయ్యద్ ఈ అపార్టు మెంట్లో ఉన్నట్లు తెలుస్తోంది.