గవర్నర్ హోదాను మరిచి మాట్లాడుతున్నారా...

Published : Jan 02, 2017, 07:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
గవర్నర్ హోదాను మరిచి మాట్లాడుతున్నారా...

సారాంశం

గవర్నర్ హోదాను మరిచి  ప్రవర్తిస్తున్నారా .. అని  కాంగ్రెస్ కు అనుమానం వచ్చింది.

 

తెలంగాణా ఆంధ్రా రాష్ట్ర గవర్నర్ ప్రవర్తన అనుచింతంగా ఉందని తెలంగాణా కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

 

రాజ్ భవన్- ముఖ్యమంత్రి సంబంధాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక కొత్త మలుపు తిప్పిన మాట నిజం.

 

ఏ రోజూ గవర్నర్ కు పాదాభివందనం చేసి అయ్యావారి ఆశీర్వాదం స్వీకరించారో ఆ రోజు నుంచి గవర్నర్ నరసింహన్ కూడా పూర్తిగా మారిపోయారు.

 

 ఒక గవర్నర్ తో ముఖ్యమంత్రికి ఉండేసంబంధం రాజ్యాంగ బద్ధమయినదే. కేవలం నామమాత్రమే. ప్రతి జివో మీద గవర్నర్ ఆమోదంతో ఈ జివొ విడుదల చేస్తున్నామనిరాసి, గవర్నర్ పేరు మీద పరిపాలన చేస్తున్నట్లు  చెప్పుకోవడం రాజ్యాంగ నియమం.

 

చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు గవర్నర్ లను కలవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తెలంగాణా ఉద్యమ కాలంలో  ఇదే గవర్నర్ మీద ఎంత వ్యతిరేకత ఉండిందో ఇపుడంత  గౌరవం భక్తి పెరిగాయి. వారిరువురి సమావేశాలకు లెక్కేలేదు

 

బహుశా దేశంలో ముఖ్యమంత్రి పాదాభివందనాలు స్వీకరించిన గరవ్నర్ నరసింహనేకావచ్చు. అదే విధంగా గవర్నర్ నుంచి   ఈ పద్ధతిలో ఆశీస్సులు పొందిన ముఖ్యమంత్రి కూడా కెసిఆరే కావచ్చు.

 

ఈ రిలేషన్షిప్ కాంగ్రెస్ కు అర్థం కావడం లేదు. తాజాగా  గవర్నర్ ‘డైనమిక్ సీఎం’ అంటూ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడం  తెలంగాణా కాంగ్రెసును ఇరుకున బెట్టింది.

 

ముఖ్యమంత్రి పార్టీఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నా గవర్నర్పట్టించుకోవడం లేదని,దీనికి కారణం ఈ ఇద్దరి స్నేహబంధమే  అని ఈ రోజు కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అరోపించారు.

 

డైనమిక్ సిఎం ఎలా అయ్యారని ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. 

 

*రుణమాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి, మైనార్టీ లకు రిజర్వేషన్ ఇవ్వనందుకా ?

 

*ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అప్పులు చేసినందుకా?

 

*కేసీఆర్ సీఎం ఐన తరువాత ఒక్క మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయనందుకా?

 

 అదే విధంగా గవర్నర్ ప్రవర్తన అనుచింతగా ఉందని చెబుతూ ఫిరాయింపుల చట్టాన్ని గౌరాంచని   గవర్నర్ దేశంలో నరసింహన్ ఒక్కరే అని షబ్బీర్ అన్నారు.

 

ఫిరాయింపులను కట్టడి చేయాల్సింది పోయి,  ప్రోత్సహించేలా సీఎం భజన చేయడం గవర్న ర్ మాననుకోవాలని ఆయన  కోరుతున్నారు.

‘ఇలాంటి గవర్నర్ కు  వినతి పత్రాలు ఇవ్వడం వేస్టు. .ఈ విషయం పై పార్టీలో చర్చిస్తాం. ఇదంతా పదవిని కాపాడుకునేందుకే ,’అని ఆయన అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ