లక్కీ స్టోన్‌లో లైట్ అమర్చి.. జలకన్య కన్నుగా మాయమాటలు, 2 కోట్లకు అమ్మే యత్నం

Siva Kodati |  
Published : Feb 09, 2023, 09:03 PM IST
లక్కీ స్టోన్‌లో లైట్ అమర్చి.. జలకన్య కన్నుగా మాయమాటలు, 2 కోట్లకు అమ్మే యత్నం

సారాంశం

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. జలకన్య కన్ను అంటూ రూ.2 కోట్లకు విక్రయించేందుకు యత్నించారు కేటుగాళ్లు  

ప్రజలను రకరకాల మార్గాల్లో బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకునే ముఠాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అమాయకులు దొరికితే చాలు వారిని నిలువునా ముంచెస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. జలకన్య కన్ను అంటూ రూ.2 కోట్లకు విక్రయించే యత్నం చేశారు. లక్కీస్టోన్‌లో లైట్‌ను ఏర్పాటు చేసి మోసం చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వరంగల్ కు చెందిన చందూతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??