ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది ఇప్పుడే చెప్పం.. కేటీఆర్‌తో అక్బరుద్దీన్ సవాల్‌పై అసదుద్దీన్ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 9, 2023, 7:51 PM IST

ఇటీవల అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి, మంత్రి కేటీఆర్‌కు మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది ఇప్పుడే చెప్పమన్నారు. 


ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది చెప్పడానికి ఇంకా టైం వుందన్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇటీవల అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి, మంత్రి కేటీఆర్‌కు మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్‌కు దూరం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వీరిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో ఇప్పుడే చెబితే టూ ఎర్లీ అవుతుందన్నారు. కేసీఆర్ మంచి పాలన అందిస్తున్నారని అసదుద్దీన్ ప్రశంసించారు. ఇతర పార్టీల మీటింగ్‌లకు ఎంఐఎం ఎందుకెళ్తుందని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీని బీజేపీకి బీ టీమ్‌గా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని.. కానీ తాము మాత్రం బీజేపీని ఓడించాలని కోరుకుంటున్నామని ఒవైసీ స్పష్టం చేశారు. తాజ్ మహల్‌ను మించి కొత్త సచివాలయం వుందని ఆయన ప్రశంసించారు. 

Latest Videos

Also REad: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యపై అక్బరుద్ధీన్ ఓవైసీ సంచలన ప్రకటన

ఇదిలావుండగా..  కొద్దిరోజుల క్రితం  అసెంబ్లీలో ఎంఐఎం  పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్  మధ్య  మాటల యుద్ధం సాగింది . గవర్నర్  ప్రసంగానికి  ధన్యవాదాలు తెలిపే  తీర్మానంపై  ప్రసంగం  సమయంలో అక్బరుద్దీన్  ప్రసంగంపై  మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం  చేశారు. బడ్జెట్ పై చర్చ సమయంలో ప్రసంగిస్తున్నట్టుగా  అక్బరుద్దీన్ తీరు ఉందన్నారు. ఏడురుగురు ఎమ్మెల్యేలున్న  ఎంఐఎంకు  ఇంత సమయం ఇస్తే  వందకు పైగా  ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి ఎంత సమయం కేటాయించాలని  మంత్రి కేటీఆర్ స్పీకర్  ను కోరారు. దీనికి  అక్బరుద్దీన్  ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో  50 అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేస్తామని  ఆయన  ప్రకటించారు. అంతేకాదు  తమ పార్టీ  15 మంది ఎమ్మెల్యేలను గెలుస్తుందని  ఆయన ధీమాను వ్యక్తం  చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో  పోటీ చేసే విషయమై తమ పార్టీ అధినేతతో  మాట్లాడుతానని కూడా అక్బరుద్దీన్ ఓవైసీ  అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
 

click me!