
నాగార్జున సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర్‌ఘాట్ వద్ద వీరు గల్లంతయ్యారు. వీరంతా హైదరాబాద్‌కు చెందినవారిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.