పోలీస్ బాస్ గొంతుతో నిరుద్యోగులకు గాలం.. లక్షలకు టోకరా...

By AN TeluguFirst Published Oct 10, 2020, 9:26 AM IST
Highlights

ఏకంగా పోలీసు ఉన్నతాధికారి సీవీ ఆనంద్ స్వరాన్నే అనుకరిస్తూ మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులనుండి లక్షల రూపాయలకు వసూలు చేస్తోంది ఈ ముఠా. వీరినుండి రెండు బైక్ లు, రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడకు చెందిన ప్రధాన నిందితుడు అక్కపల్లి చంద్రశేఖర్, గండీడ్  మండలం సంచర్లకు చెందిన దొమ్మరి రవి, నాగర్ కర్నూల్  జిల్లా తిమ్మాజి పేట అవంచకు చెందిన మాదాసు బాలయ్య, మాదాసు తేజలు ఓ ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడ్డారు. 

వీరు గత తొమ్మది నెలలుగా సీవీ ఆనంద్ గొంతుతో షాద్ నగర్, జడ్చర్ల, తిమ్మాజిపేట, బిజినేపల్లి, కొత్తకోట మండలాల్లో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేశారు.

జడ్చర్లకు చెందిన ఓ బాధితుడు ఉద్యోగం ఆశతో తాను ఆరున్నర లక్షల రూపాయలు మోసపోయానని ఫిర్యాదు చేయడంతో విషయం బైట పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను శుక్రవారం మహబూబ్ నగర్ శివారు అప్పన్నపల్లి వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు వీరు 12 మంది దగ్గర 28 లక్షల రూపాయలు వసూలు చేశారు. 
 
click me!