మహిళతో సహజీవనం: బిజెపి కరీంనగర్ మాజీ అధ్యక్షుడి అరెస్టు

By telugu teamFirst Published Oct 10, 2020, 8:45 AM IST
Highlights

మహిళా నేతతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న వీడియో లీక్ కావడంతో బాస సత్యనారాయణపై బిజెపి వేటు వేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ ఫిర్యాదుతో బాస సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు.

కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం బాస సత్యనారాయణతో పాటు మరో అడ్వకేట్ ముద్దమల్ల సుధాకర్ లపై కేసు నమోదు అయింది. తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడని స్వప్న అనే మహిళ ఈ ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో పోలీసులుబాస సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు టూ టౌన్ సీఐ టి. లక్ష్మీ బాబు తెలిపారు. అట్రాసిటీ తో పాటు మోసం చేశారన్న ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు చేసిన స్వప్నను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

See Video: వేటు పడిన బిజెపి నేత రాసలీలల వీడియో ఇదే (చూడండి)

ఏడాది కాలంగా తనతో సహజీవనం చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో చెప్పారు. తనను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నిరాకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

బాస సత్యనారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

మహిళా నాయకురాలితో రాసలీలలు నెరుపుతూ పట్టుబడిన బాస సత్యనారాయణను బిజెపి నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి చెందన వీడియో, ఆడియో లీకైన విషయం తెలిసిందే. అది కరీంనగర్ లో తీవ్ర సంచలనం సృష్టించింది. 

click me!