చంద్రబాబుకు షాక్: అక్రమాస్తుల కేసుపై ఇక రోజువారీ విచారణ

By telugu teamFirst Published Oct 10, 2020, 9:14 AM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ పై సీబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 21వ తేదీ నుంచి రోజువారీ పద్ధతిలో విచారణ చేపట్టనుంది. చంద్రబాబు అక్రమాస్తులు సంపాందించారని లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్:  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా 15 ఏళ్లుగా ఈ కేసు విచారణ నిలిచిపోయింది. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన చంద్రబాబు పెద్ద యెత్తున అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి 2005లో పిటిషన్ దాఖలు చేశారు 

ఆ పిటిషన్ మీద ఈ నెల 21వ తేదీ నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ జరుగుతుంది. ఎంపీలపై, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై సత్వర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబుపై కేసు విచారణ జరగనుంది.

Also Read: తెరపైకి ఓటుకు నోటు కేసు: ఈ నెల 12 నుండి రోజువారీ విచారణ

సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించిన నేపథ్యంలో అప్పట్లో చందర్బాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దాంతో కేసు విచారణ గత 15 ఏళ్లుగా నిలిచిపోయింది. స్టే గడువు ఆరు నెలలకు మించి ఉండరాదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో చంద్రబాబుపై నమోదైన అక్రమాస్తుల కేసు విచారణను ప్రారంభించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని త్వరలో నమోదు చేయనున్నారు తదుపరి విచారణను సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. 

click me!