
నల్లగొండ: బీమా సొమ్ము పంపకంలో విషయంలో తలెత్తిన వివాదం కారణంగా బీమా సొమ్మును కాజేసే ముఠా గుట్టు రట్టయింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి, హారిక భార్యాభర్తలు, హారికు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న ముఠా సభ్యులు ఆమెను సంప్రదించారు.
కోటిరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించారు. అతని పేరు మీద బీమా పాలసీ కట్టారు. ఫిబ్రవరి 24వ తేీదన ముఠా సభ్యులు అతన్ని హత్య చేశారు. తర్వాత బొత్తలపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించారు. అతని పేరు మీద రూ.12 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు.
Also Read: అక్రమ సంబంధాలు, రోగాలే సొమ్ము: కరుడు కట్టిన ముఠా గుట్టు రట్టు
ఆ డబ్బు పంపకంలో తలెత్తిన వివాదం పోలీసులకు చేరింది. అనుమానంతో హారికను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో బీమా మాఫియా గుట్టు రట్టయింది. విషయం తెలిసిన ముఠా సభ్యులు రాజు నాయక్, కంచి శివ, మందారి సాయిసంపత్, వేముల కొండల్ పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ ముఠా చేసిన దారుణాలు కొన్ని ఇలా ఉన్నాయి.....
అనారోగ్యంతో బాధపడుతున్న మిర్యాలగుడా మండలం జటావత్ తంాడకు రూపావత్ దేవాను ఈ ముఠా చంపేసింది. ఈ హత్యలో దేవా భార్య ధనమ్మ పాత్ర కూడా ఉంది. దేవార పేరిట రూ.12 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నారు.
దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన పరంగి సోమయ్య అనారోగ్యంతో బాధపడుతుండడాన్ని గమనించారు. అతని పేరిట బీమా పాలసీ చేయించారు. ఆ తర్వాత అతన్ని చంపేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రూ.10 లక్షలు కాజేశారు.
ఇదే గ్రామానికి చెదిన దైద హుస్సేన్ ను హత్య చేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించారు. రూ.53 లక్షలు క్లెయిమ్ చేసి పంచుకున్నారు.
దామరచర్ల మండలం కల్లెపల్లికి చెందిన ధీరావత్ లాల్ సింగ్ ను కూడా అతని భార్య సాయంతో హత్య చేశారు. రూ. 23 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్ారు.
అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లవాగు తండాకు చెందిన సభావత్ తుల్య పేరు మీద బీమా పాలసీ చేయించారు. ఆ తర్వాత చంపేశారు. భార్యాపిల్లలను ఒప్పించి ఆ పనిచేశారు. ఆ తర్వాత రూ.60 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామానికి చెందిన బూక్యూ నాగులు నాయక్ ను కూడా అదే పద్ధతిలో హత్య చేసి బీమా సొమ్ము క్లెయిమ్ చేసుకున్నారు.