చోరీ కేసులో జైలుకి వెళ్లొచ్చి... ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని..

Published : Mar 10, 2021, 07:53 AM ISTUpdated : Mar 10, 2021, 08:04 AM IST
చోరీ కేసులో జైలుకి వెళ్లొచ్చి... ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని..

సారాంశం

గత నెల 14న లలితానగర్ లోని వృద్ధ దంపతులకు ఈ యువతి కరోనా టీకా పేరుతో మత్తుమందు ఇచ్చి వారి నగలు చోరీ చేసింది. ఈ కేసులో పోలీసులు ఆమెను జైలుకు పంపించారు.

తనను ప్రేమించి గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తప్పించుకు తిరుగుతున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ కి చెందిన యువతి(21) జిల్లెలగూడ లలితానగర్ లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. దేవరకొండకు చెందిన విజయ్ కుమార్(25) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజులపాటు వారిద్దరూ ఒకే చోట కలిసి ఉన్నారు.

గత నెల 14న లలితానగర్ లోని వృద్ధ దంపతులకు ఈ యువతి కరోనా టీకా పేరుతో మత్తుమందు ఇచ్చి వారి నగలు చోరీ చేసింది. ఈ కేసులో పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. ఇటీవల బయటకు వచ్చిన తరువాత ఆమె విజయ్ కుమార్ ను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు.

తనను కలవకపోగా.. ఫోన్ చేసినా స్పందించడంలేదని బాధితురాలు వాపోయింది. దీంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే