హైద్రాబాద్‌లో గణేష్ నిమజ్జనం: ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర

By narsimha lodeFirst Published Sep 19, 2021, 9:30 AM IST
Highlights


హైద్రాబాద్ నగరంలో గణేష్ విగ్రహ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ విగ్రహనికి పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల లోపుగా ఈ యాత్రను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్: సుప్రీంకోర్టు  ఆదేశాల మేరకు వినాయక విగ్రహల నిమజ్జనం ఆదివారం నాడు ప్రారంభమైంది. తొలుత ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం పూర్తి చేయాలని అధికారలు భావిస్తున్నారు.ఇవాళ ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తైతే   నిమజ్జన ప్రక్రియలో సగభాగం పూర్తైనట్టుగా అధికారులు భావిస్తారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ 4 వద్ద ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని నిమజ్జనం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు మరో 25 చెరువుల్లో గణేష్ విగ్రహల నిమజ్జన ప్రక్రియ చేయనున్నారు. ఇవాళ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. 

బాలపూర్ నుండి  హుస్సేన్ సాగర్ వరకు 17 కి.మీ. ప్రధాన మార్గంలో 276 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  గణేష్ విగ్రహల వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  చాంద్రాయణగుట్ట, చార్మినార్, మదీనా, మొజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టీ,  హుస్సన్ సాగర్ వరకు ఉన్న మార్గంలో గణేష్ విగ్రహాలను తరలించే విగ్రహలకు మాత్రమే  అనుమతిస్తారు.

click me!