హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్‌పై కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం

Siva Kodati |  
Published : Sep 18, 2021, 09:18 PM IST
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్‌పై కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం

సారాంశం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. 

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 27 సీ 0206గా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather