తెలంగాణ స్పీకర్ పల్లె నిద్రపై గండ్ర పంచ్ (2 వీడియోలు)

First Published Jan 3, 2018, 6:00 PM IST
Highlights
  • డబుల్ బెడ్రూము ఇండ్లు అడగండి
  • పల్లె నిద్ర చేస్తుండుగా 
  • స్పీకర్ పల్లె నిద్ర తో హల్ చల్

భూపాలపల్లిలో గత కొంతకాలంగా స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే అయిన మధుసూదనాచారి పల్లె నిద్ర చేపడుతున్నారు. గడగడ వనికే చలిలోనూ ఆయన పల్లె నిద్రకు ఉపక్రమించారు. గ్రామాలు, మారుమూల తండాల్లో స్పీకర్ పర్యటిస్తున్నారు. రాత్రిళ్లు అక్కడే నిద్రించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయమే గ్రామస్తులతో చిట్ చాట్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

అయితే స్పీకర్ పల్లె నిద్ర పై స్థానిక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి పంచ్ లు విసిరారు. నియోజకవర్గంలో స్పీకర్ రాత్రి నిద్ర బాగానే చేస్తున్నారు కానీ... గ్రామాల్లో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నయా అని గండ్ర ప్రశ్నించారు. ఇండ్లు ముచ్చట ఎంతవరకు వచ్చిందో స్పీకర్ ను అడగాలని గండ్ర గ్రామస్తులకు సూచించారు. గండ్ర వెంకట రమణారెడ్డి గ్రామస్తులతో జరిపిన సంభాషణ చూడండి కింది వీడియోలో.

 

స్పీకర్ పల్లె నిద్ర వీడియో కింద చూడొచ్చు..

తెలంగాణలో చలి తాకిడిని లెక్కచేయకుండా స్పీకర్ మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. గ్రామాల్లో పొద్దున్నే లేచి పండ్లపుల్ల వేసుకుని పండ్లు తోముకుని చలిమంటల దగ్గర చాయి తాగి గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోని ఘనపూర్ మండలం కర్కపల్లి లో "పల్లె ప్రగతి నిద్ర " చేశారు స్పీకర్ ఎస్ మధుసూదన చారి. పల్లెనిద్రలో భాగంగా ఉదయం ఎస్సీ కాలనిలో పర్యటించి., సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ చలిమంట దగ్గర చాయి తాగడం హాట్ టాపిక్ అయింది.

 

click me!