45 మందికి నెగిటివ్ రిపోర్ట్: ఇద్దరి శాంపిల్స్ మరోసారి పూణెకు

By narsimha lodeFirst Published Mar 4, 2020, 1:03 PM IST
Highlights

హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి బుధవారం నాడు ఉదయం నుండి 15 మంది కరోనా అనుమానితులు వచ్చారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి బుధవారం నాడు ఉదయం నుండి 15 మంది కరోనా అనుమానితులు వచ్చారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు నిన్న పరీక్షలు నిర్వహించిన వారిలో  మరో ఇద్దరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. వీరికి మరోసారి పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ ను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.

Also read:సికింద్రాబాద్‌లో టెక్కీకి కరోనా: స్కూళ్లకు సెలవులు

సికింద్రాబాద్‌లోని  మహేంద్ర హిల్స్ కు చెందిన  టెక్కీ  దుబాయ్ నుండి వచ్చాడు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రం నుండి పంపిన శాంపిల్స్ నుండి 45 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు  లేవని రిపోర్టులు వచ్చాయి. మొత్తం 47 మంది శాంపిల్స్ పంపితే 45 మందికి కరోనా వ్యాధి లక్షణాలు లేవని ఈ రిపోర్టు తేల్చింది. అయితే ఈ 45 మంది కూడ మరో 15 రోజుల వరకు ఇంటి బయటనే ఉండాలని వైద్యులు సూచించారు. 

అయితే ఇద్దరికి మాత్రం ఇంకా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో ఈ ఇద్దరికి చెందిన శాంపిల్స్ ను మరోసారి పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపుతున్నారు.

ఇటలీ నుండి వచ్చిన ఇద్దరిలో ఒకరికి ఈ లక్షణాల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  మరో వైపు కరోనా పాజిటివ్ వచ్చిన టెక్కీతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తి శాంపిల్స్ విషయమై కూడ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఇద్దరికి చెందిన శాంపిల్స్ ను మరోసారి పూణెకు పంపారు. ఈ రిపోర్టు కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు.  

click me!