రాంగ్ కాల్ ద్వారా పరిచయమై కిడ్నాప్ చేసి బంధించి యువతిపై అత్యాచారం

By telugu teamFirst Published Mar 4, 2020, 11:52 AM IST
Highlights

రాంగ్ కాల్ ద్వారా యువతిని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను బడిలో బంధించి, మిత్రుడితో అత్యాచారం చేయించాడు.

మంచిర్యాల: రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి కారణంగా యువతి అత్యాచారానికి గురైంది. రాంగ్ కాల్ ద్వారా తొలుత ఆ వ్యక్తి యువతికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆమెను తన మిత్రులకు పరిచయం చేశాడు. వారిలో ఓ మిత్రుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామంలో జరిగింది. దండేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి గత నెల 27వ తేదీన అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. ఈ కేసును ఛేదించడానికి పోలీసు బృందం దర్యాప్తు చేస్తున్న క్రమంలో సెల్ ఫోన్ డేటా ఆధారంగా అసలు విషయాలు బయటపడ్డాడయి. 

యువతి సెల్ ఫోన్ కు గత నెల 2వ తేదీన ఆ రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ చేసిన వ్యక్తి మంచిర్యాలకు చెందిన సాయికృష్ణ. అప్పటి నుంచి అతను ఆ యువతికి పదే పదే ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో ఆమె తల్లిదండ్రులు అతన్ని మందలించారు. 

ఫిబ్రవరి 25వ తేదీన అతను యువతికి ఫోన్ చేసి స్థానికంగా ఉన్న అంబేడ్కర్ చౌరస్తాకు రావాలని చెప్పాడు. అప్పటికే మిత్రుడ శివకృష్ణతో వచ్చిన సాయికృష్ణ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రామకృష్ణాపూర్ లోని మూతపడిన ఓ పాఠశాలకు తీసుకుని వెళ్లాడు. అక్కడ బీజోన్ కు చెందిన రాచకట్ల శశికాంత్, మరో బాలుడు అప్పటికే ఉన్నారు. వారంతా క్యాటరింగ్ పనులు చేస్తుంటారు.

అక్కడికి చేరుకోగానే యువతి సెల్ ఫోన్ లాక్కున్నారు. సిమ్ ను శశికాంత్ సెల్ ఫోన్ లో వేసుకున్నారు. ఆ తర్వాత శశికాంత్ ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలిని రెండు రోజుల పాటు బడిలోనే ఉంచారు. గత నెల 27వ తేదీ ఆమెను శివకృష్ణ చెల్లెలి ఇంటికి తెచ్చారు. అక్కడి నుంచి యువతి తప్పించుకుని బంధువులకు సమాచారం ఇచ్చింది. బంధువుల సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు మంగళవారనంాడు ఆటోలో కరీంనగర్ వైపు వెళ్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టి మైనర్ ను హైదరాబాదులోని జువైనల్ హోంకు పంపించారు. 

click me!