హైదరాబాద్‌: బట్టబయలైన మరో పేకాట కేంద్రం ... గెస్ట్‌హౌస్‌లో వెలుగు చూసిన దందా

By Siva KodatiFirst Published Nov 5, 2021, 8:38 PM IST
Highlights

బేగంపేటలో (begumpet) మరో పేకాట వ్యవహారం బట్టబయలైంది. ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పేకాట ఆడుతున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీపావళి నాడు ఈ క్యాసినో నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 

సినీనటుడు నాగశౌర్య ఫాంహౌస్‌లో (naga shourya farm house) పేకాట (gambling) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన మరిచిపోకముందే బేగంపేటలో (begumpet) మరో పేకాట వ్యవహారం బట్టబయలైంది. ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పేకాట ఆడుతున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీపావళి నాడు ఈ క్యాసినో నిర్వహించినట్లుగా తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో క్యాసినోపై టాస్క్ ఫోర్స్ దాడులు చేశారు. అనంతరం బేగంపేట పోలీసులకు అప్పగించారు . 

మరోవైపు హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో  Playing Cards నిర్వహించిన Gutha Suman Kumarను విచారించిన నార్సింగి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. ప్రములను Goa, Srilankaకు తీసుకెళ్లి క్యాసినో కేంద్రాలు నిర్వహించాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. గత నెల 31న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవులలోని హీరో Naga Shourya  ఫామ్‌హౌస్ లో  పేకాట నిర్వహిస్తున్నవారిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి  తీసుకొన్నారు. ఈ ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు కోర్టు నుండి బెయిల్ తెచ్చుకొన్నారు.

Also Read:గోవా,శ్రీలంకల్లో గుత్తా సుమన్ కుమార్ క్యాసినో కేంద్రాలు: దర్యాప్తులో కీలక విషయాలు

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ కుమార్ ను కోర్టు అనుమతితో నార్సింగి పోలీసులు ఈ నెల 3న కస్టడీలోకి తీసుకొన్నారు. రెండు రోజుల పాటు గుత్తా సుమన్‌కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. చర్లపల్లి జైలు నుండి సుమన్ కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. Andhra Pradesh, Telangana రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో సుమన్‌కుమార్ టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.  రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కూడా సుమన్‌కుమార్ కు సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. గోవా, శ్రీలంకలలో గుత్తా సుమన్ కుమార్ క్యాసినో సెంటర్లను నిర్వహించాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

అంతేకాకుండా పేకాట కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో సముమ్ కుమార్ ఛాటింగ్ చేసేవాడు.ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రముఖులకు సుమన్ కుమార్ ఆహ్వానం పంపేవాడు. డిజిటల్ రూపంలో సుమన్ కుమార్ డబ్బులు తీసుకొనేవాడు.  అయితే ఈ డబ్బులు తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్  అందించేవాడు.ఇదిలా ఉంటే పేకాట ఆడే వారి నుండి సుమన్ కుమార్ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఒక్కో టేబుల్ కు రూ. 5 లక్షలను వసూలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేకాట ఆడదుతూ దొరికితే తనదే పూచీకత్తు అంటూ ఆయన వాట్సాప్ గ్రూపుల్లో ఛాటింగ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.

click me!