ఆ భూముల వివరాలు చెప్పండి.. కలెక్టర్లకు తెలంగాణ సర్కార్ ఆదేశం

By Siva KodatiFirst Published Nov 5, 2021, 8:01 PM IST
Highlights

జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీకి (cabinet sub committee) భూముల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హౌస్ సైట్స్ కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అనధికారిక లే ఔట్స్, ప్లాట్స్ క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం భూములపై రిపోర్ట్ ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ

జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీకి (cabinet sub committee) భూముల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. జీవో నెంబర్ 166 కింద వచ్చిన అప్లికేషన్స్ , జీవో 58, జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు, అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ వక్ఫ్ భూములు కోర్ట్ కేసుల్లో వున్న భూముల వివరాలు పంపాలని సర్కార్ ఆదేశించింది. ఆ భూముల విలువ ఎంత అనేది కూడా వెంటనే పంపాలని ఆదేశించింది. హౌస్ సైట్స్ కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అనధికారిక లే ఔట్స్, ప్లాట్స్ క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం భూములపై రిపోర్ట్ ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ. దీనిపై సెప్టెంబర్‌లోనే కమిటీ వేసింది తెలంగాణ సర్కార్. 

click me!