కొమురం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు, రంగంలోకి అటవీశాఖ

By Siva KodatiFirst Published Nov 5, 2021, 7:28 PM IST
Highlights

కొమురం భీం జిల్లాలో (komaram bheem district) పెద్ద పులి (tiger) హల్ చల్ చేసింది. పెంచికల్ - పేట్‌లోడ్‌పల్లి మధ్యలో గల బ్రిడ్జి దగ్గర పులి సంచరించింది. రోడ్డు దాటుతున్న పులిని చూసిన వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

కొమురం భీం జిల్లాలో (komaram bheem district) పెద్ద పులి (tiger) హల్ చల్ చేసింది. పెంచికల్ - పేట్‌లోడ్‌పల్లి మధ్యలో గల బ్రిడ్జి దగ్గర పులి సంచరించింది. రోడ్డు దాటుతున్న పులిని చూసిన వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కాగా.. కొద్దిరోజుల  క్రితం నిర్మల్ జిల్లాలో (nirmal district) చిరుత (leopard) సంచారం భయాందోళన కలిగిస్తోంది. కడెం ప్రాజెక్ట్ (kadem project) ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత. ఒక గొర్రెను చంపేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు (forest department) పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ALso Read:నిర్మల్‌ జిల్లాలో చిరుత పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామాలు

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో చిరుత పులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి రావడం, పశువులను చంపుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొద్దినెలల క్రితం ఇదే నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. పంట పొలాల సమీపంలో అడవి పందిపై చిరు దాడి చేసింది. దీంతో పరిసరాల్లో ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు. 

ఆ వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించారు. త్వరలోనే దానిని బంధించి తీసుకెళ్తామని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. అలాగే గతంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ (komaram bheem district) , భద్రాద్రి కొత్తగూడెం (bhadradri kothagudem) సహా పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. 

click me!