అమానుషం : డబ్బు కోసం చితి ఎక్కి కూర్చున్న కాటి కాపరులు.. ఆపై..

By AN TeluguFirst Published Apr 12, 2021, 1:31 PM IST
Highlights

జగిత్యాలలో దారుణం జరిగింది. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి రుజువయ్యింది. మరణించిన వ్యక్తిమీద కనీస మానవత్వం చూపించకుండా వ్యవహరించిన ఘటన జుగుస్స కలిగించింది. 

జగిత్యాలలో దారుణం జరిగింది. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి రుజువయ్యింది. మరణించిన వ్యక్తిమీద కనీస మానవత్వం చూపించకుండా వ్యవహరించిన ఘటన జుగుస్స కలిగించింది. 

స్మశానంలో కాష్టం కాల్చాల్సిన కాటి కాపరులు డబ్బుల కోసం మృతుల కుటుంబసభ్యులను వేధించారు. రూ. 10వేలు ఇచ్చేవరకు చితినుంచి దిగమంటూ గొడవకు దిగారు. ఈ ఘటన జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. 

దీంతో గ్రామస్తులే చొరవ తీసుకుని, అంత్యక్రియలు ముగించారు. ఈ విషయం వెలుగులోకి రాగా కాటికాపరుల ఈ ప్రవర్తన మీద అందరూ విరుచుకుపడుతున్నారు. 
వివరాల్లోకి వెడితే గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్మశాన వాటికకు తీసుకెళ్లారు. కాగా కాటికాపరులు వచ్చి చితి మీద కూర్చున్నారు. రూ. 10వేలు ఇస్తే కానీ అంతిమ సంస్కరాలు చేయనివ్వబోమంటూ అడ్డుకున్నారు. 

అంతేకాదు అప్పటివరకు చితిమీదినుంచి దిగమంటూ మొండి పట్టు పట్టారు. గ్రామస్తులు వారితో మాట్లాడి వెయ్యి రూ.లు ఇప్పిస్తామని చెప్పినా వారి పట్టు విడవలేదు. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి చితిమీద కూర్చున్న కాటి కాపరులను పక్కను తోసేసి వారే అంతిమసంస్కరాలు చేశారు. 

click me!