ఆమరణదీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు...

Published : Apr 12, 2021, 12:58 PM IST
ఆమరణదీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు...

సారాంశం

పంజాగుట్ట చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆమరణ దీక్ష చేపట్టారు.

పంజాగుట్ట చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆమరణ దీక్ష చేపట్టారు.

అంబర్ పేటలోని తన నివాసంలోనే దీక్షకు కూర్చున్న విహెచ్.  అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్స్టేషన్లో నిర్బంధించడం రాజ్యాంగ ఉల్లంఘన అని, భారత జాతికి అవమానకరం అని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణం పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతనా?  ఉగ్రవాదా? అంటూ మండిపడ్డారు.  అంబేద్కర్ విగ్రహంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. 

అంబేద్కర్ ను అవమానించడం అంటే ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ ను అవమానించడమేనని అన్నారు. అంబేద్కర్ విగ్రహం పై అఖిలపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాలన్నారు. మా పార్టీ నాయకులు కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!