భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి ఇకలేరు..

By AN Telugu  |  First Published Apr 12, 2021, 12:49 PM IST

భద్రాచలం మాజి శాసనసభ్యులు కుంజా బొజ్జి (95) అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కుంజాబొజ్జి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు సీపీఎం తరఫున పోటీచేసి గెలుపొందారు.

కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కుంజా బొజ్జిని బంధువులు చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత బొజ్జి ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

Latest Videos

undefined

ఈ నేపత్యంలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు. కుంజా బొజ్జి వరుసగా 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఎం పార్టీ తరఫున అన్నీ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.

ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరులకు ఎన్నో సేవలందించారు. కాగా కుంజా బొజ్జి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురంలోని అడవి వెంకన్న గూడెం. ఆయన భార్య లాలమ్మ 2018లో చనిపోయారు. బొజ్జికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుంజా బొజ్జి మృతికి వివిధ పార్టీలకు చెందిన నాకులు సంతాపం తెలిపారు.
 
click me!