వంశపారంపర్య రాజకీయాలు.. తెలంగాణకు విముక్తి బీజేపీతోనే సాధ్యం: రాజీవ్ చంద్రశేఖర్

By Mahesh Rajamoni  |  First Published Oct 15, 2023, 12:23 PM IST

HYDERABAD: వారసత్వ రాజకీయాల నుంచి తెలంగాణను విముక్తం చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమ‌వుతుంద‌ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కూడా వారికి ఇష్టం లేద‌ని తెలిపారు. తెలంగాణలో ప్ర‌జ‌ల‌తో పాటు తాము కూడా మార్పును కోరుకుంటున్నామని చెప్పారు.
 


Union Minister Rajeev Chandrasekhar: వారసత్వ రాజకీయాల నుంచి తెలంగాణను విముక్తం చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమ‌వుతుంద‌ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కూడా వారికి ఇష్టం లేద‌ని తెలిపారు. తెలంగాణలో ప్ర‌జ‌ల‌తో పాటు తాము కూడా మార్పును కోరుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనీ, రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ అవినీతి, వారసత్వ రాజకీయాలను అంతం చేయగల ఏకైక పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్న ఆయ‌న ప్ర‌జ‌ల ఆకాంక్షలను అందుకోవడంలో విఫలమైందన్నారు.

Latest Videos

undefined

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకున్న‌ద‌ని ఆరోపించారు. తెలంగాణలో చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పన ఏదైతే జరిగిందో అది ప్రధాని నరేంద్ర మోడీ చేశారన్నారు. రోడ్లు, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, నీరు, విద్యుత్ ఇలా అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోడీ ప్రభుత్వం తెలంగాణలో ప్రారంభించిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన పదేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొననుండటంతో పుంజుకున్న కాంగ్రెస్, ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ రెండూ బీఆర్ఎస్ ను గద్దె దించి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 65 ఏళ్లుగా ప్రజలు పోరాడారన్నారు. ఒక రాజవంశం స్థానంలో మరొక రాజవంశాన్ని అధిష్టానానికి అప్పగించాలని వారు ఎన్నడూ కోరుకోలేద‌న్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఒక రాజవంశం మరో వంశం స్థానంలో పగ్గాలు చేపట్టిందని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కూడా వారికి ఇష్టంలేద‌ని దెలిపారు.

1997 నుంచి తెలంగాణా వాదానికి మద్దతిచ్చిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేననీ, అందుకే తెలంగాణలో మార్పుకు కారకులం, వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి నుంచి తెలంగాణను శాశ్వతంగా విముక్తం చేసి రాష్ట్రంలో అభివృద్ధి, సౌభాగ్యాన్ని తీసుకురాగల పార్టీ త‌మ‌దేన‌ని మంత్రి చంద్రశేఖర్ అన్నారు.

click me!