పోలీసులపైనే తప్పుడు ప్రచారం, డిజిపికి ట్యాగ్... ఇద్దరు యువకులపై కేసు

By Arun Kumar PFirst Published May 26, 2021, 10:51 AM IST
Highlights

సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులపై తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదయ్యింది. 

హైదరాబాద్: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారంచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  పోలీసులు హెచ్చరించే విషయం తెలిసిందే. అలాంటిది అదే సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులపైనే  తప్పుడు ప్రచారం చేశారు ఇద్దరు యువకులు. దీంతో యువకులిద్దరిపై కేసు నమోదయ్యింది. 

హైదరాబాద్ కు చెందిన భరద్వాజ్ సోమరాజు, జీవన్ అనే ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ వుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఓ సంఘటనను తెలంగాణ జరిగిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ పోలీసులపై అసభ్య కామెంట్స్ తో కూడిన ఈ పోస్ట్ ని రాష్ట్ర డిజిపి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.  

read more  కారులో వెళ్లి దర్జాగా దొంగతనం.. పోలీసులకు చిక్కిన బిర్యానీ పాషా

దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణలో జరిగినట్లు పేర్కొంటూ ప్రచారం చేసిన సదరు వీడియో మహారాష్ట్రలో జరిగినట్లు గుర్తించారు. దీంతో తప్పుడు ప్రచారం చేసిన యువకులు సోమరాజు, జీవన్ లపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు 67 ఐటీ యాక్టు, 505(1బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

click me!