కారులో ఆడుకుంటుండగా డోరు మూసుకుపోవడంతో.. నాలుగేళ్ల చిన్నారి మృతి...

Published : Aug 26, 2023, 12:32 PM IST
కారులో ఆడుకుంటుండగా డోరు మూసుకుపోవడంతో.. నాలుగేళ్ల చిన్నారి మృతి...

సారాంశం

ఖమ్మంలో ఓ నాలుగేళ్ల చిన్నారి కారులో ఇరుక్కుపోయి మృతి చెందాడు. కారులో ఆడుకుంటుండగా డోరు లాక్ అవ్వడంతో ఈ విషాద ఘటన జరిగింది. 

ఖమ్మం :  తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఉన్న కారులో ఆడుకుంటుండగా డోర్ మూసుకుపోవడంతో నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. కారులో ఊపిరి  ఆడక మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం రుక్కి తండాలో ఈ విషాద ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు దీని గురించి మాట్లాడుతూ…బానోతు అశోక్- అనూష దంపతులు రుక్కి తండాలో ఉంటారు.  వీరికి పార్థు (4), వర్షిత్(3) అని ఇద్దరు పిల్లలు. 

హైదరాబాద్‌లో తప్పతాగి కారు నడిపిన సీఐ!.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో..

వీరిద్దరూ అంగన్వాడికి వెళ్తున్నారు. శుక్రవారం కూడా పిల్లలు ఇద్దరినీ అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. ఆ తరువాత తల్లిదండ్రులు ఇద్దరు పంట చేను దగ్గరికి వెళ్లారు. మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రాన్ని మూసేసే సమయం అవ్వడంతో అంగన్వాడీ కార్యకర్త పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి వారి మేనత్త ఇంట్లో అప్పగించి వెళ్ళింది. 

ఆ తర్వాత పార్ధు ఇంటి ఆవరణలో ఉన్న కారులో ఆడుకుంటున్న సమయంలో కారు డోరు మూసుకుపోవడంతో.. లోపల ఊపిరాడక చనిపోయాడు.  కాసేపటికి పార్ధు కనిపించడం లేదంటూ అంతా వెతికిన కుటుంబ సభ్యులు కారులో చూశారు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికే  పార్దూ మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్