వరంగల్‌లో విషాదం: బావిలో శవాలుగా తేలిన నలుగురు వలస కూలీలు

By Siva Kodati  |  First Published May 21, 2020, 8:19 PM IST

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ నలుగురు వలస కార్మికులు అనుమానాస్పద స్థితిలో మరణించారు


వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ నలుగురు వలస కార్మికులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళితే.. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో గురువారం ఉదయం నుంచి నలుగురు కార్మికులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు వీరి కోసం గాలిస్తుండగా స్థానికులకు ఈ నలుగురి మృతదేహాలు బావిలో కనిపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

స్థానికంగా గోనె సంచులు తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తున్న వీరంతా పశ్చిమ బెంగాల్ నుంచి 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, పురుషుడు ఉన్నారు. అయితే ఈ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపి బావిలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Also Read:

మధ్యప్రదేశ్ సరిహద్దులో భోజన వసతి లేదని పోలీసులపై రాళ్లు రువ్విన వలస కూలీలు

రైలు నుంచి 167మంది వలస కార్మికులు మిస్సింగ్

click me!